Latest News
రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన జీహెచ్ఎంసీ ఎస్‌ఈ
04 Feb, 2026
56 Views
రూ.15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన జీహెచ్ఎంసీ ఎస్‌ఈ
కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు.
హైదరాబాద్,ఫిబ్రవరి 04(అవనివిలేకరి)కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) చిన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ముందుగా ఫిర్యాదు అందడంతో పక్కా ప్రణాళికతో వలపన్నిన అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ స్పష్టం చేసింది. గత నెల రోజుల క్రితం కుషాయిగూడ కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రవీంద్ర సాగర్ వద్ద 10 లక్షల రూపాయలను రెండు కోట్ల రూపాయల వరకు పనులలో లంచం అడిగినట్లు రవీంద్ర సాగర్ అనే కాంట్రాక్టర్ ఆరోపించారు కూకట్పల్లి జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు లంచాలకు మరిగినారంటూ పత్రికలలో కూడా వార్తలు వచ్చాయి డి ఈ పాపమ్మ కుత్బుల్లాపూర్ మున్సిపల్ లక్ష్మీ గణేష్ వీరంతా కలిసి పది లక్షల డిమాండ్ చేసినట్లు పది లక్షల ఐదు శాతం మాకిస్తేనే వర్క్ మార్కౌట్ ఇస్తామని తెగేసి చెప్పారు.