Latest News

బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయొద్దు. - కల్వకుంట్ల కవిత

27 Feb, 2026 29 Views
Main Image
ఢిల్లీ ఎక్సైజ్ కేసు తప్పుడు కేసే.. 
బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయొద్దు: 
-,కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 27(అవనివిలేకరి)కల్వకుంట్ల కవిత రైతుల సమస్యలపై రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుపై మీడియాతో మాట్లాడారు.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు తప్పుడు కేసు అని మొదటి నుంచే చెబుతున్నానని కవిత పేర్కొన్నారు. “కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పాను. కోర్టు తీర్పుతో అదే జరిగింది. అసలు ఆర్గుమెంట్స్‌నే ఫాల్స్ అని కోర్టు స్పష్టం చేసింది. కేసులో ఉన్న వారందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం స్వాగతిస్తున్నాం,” అన్నారు.అయితే ఐదున్నర నెలలు కుటుంబానికి, పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, తీవ్ర అవమానాలు, వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు జరిగిన అవమానం తీరదు. మా కుటుంబానికి అన్యాయం జరిగింది,” అన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ట్వీట్‌పై కూడా ఆమె స్పందించారు. ఒకవైపు అభినందనలు తెలుపుతూ, మరోవైపు పార్టీ ఓటమికి ఈ కేసే కారణమనేలా వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని చూస్తే ప్రజలు హర్షించరని హెచ్చరించారు.ఉద్యోగాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడం, దోపిడీ దారులకు టికెట్లు ఇవ్వడం, అహంకారం వంటి అంశాలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. కేసు సమయంలో పార్టీ, పార్టీ సోషల్ మీడియా తగిన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు.బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో పార్టీ విఫలమైందని ఆరోపించారు. “బతుకమ్మ ఎత్తుకున్న బిడ్డను లిక్కర్ బాటిల్‌తో పోలుస్తూ అవమానించినప్పుడు పార్టీ స్పందించలేదు,” అని అన్నారు.రెండు నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కవిత, ఈ తీర్పు రావడం దేవుడి ఆశీర్వాదమని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజా తీర్పును ఎప్పుడూ గౌరవిస్తానని, కానీ ఓటమిని తనపై మోపే ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో నిజాయితీగా సమీక్షించుకోవాలని, వాస్తవాలు అంగీకరించి ప్రజలకు జవాబుదారీతనం చూపాలని కేటీఆర్‌కు సూచించారు.