Latest News

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ ఉద్యమ ఫలితమే kk కమిటీ ఏర్పాటు

17 May, 2026 67 Views
Main Image

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ గత 9 సంవత్సరాలు గా చేస్తున్న ఉద్యమం ఫలితమే కేకే కమిటీ ఏర్పాటు

అమర వీరుల బలిదానాలు తో తెలంగాణ ఉద్యమ కారుల ఉద్యమాలు పోరాటాలు తో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించిన సమయంలో మేము ఉద్యమకారులమని ఉద్యమకారులే మర్చిపోయిన సమయంలో 9 సంవత్సరాల క్రితం పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమకారుల ఫోరము ను  ఏర్పాటు చేసి  విడిపోయిన తెలంగాణ ఉద్యమకారులను చైతన్యం చేసి ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమము కోసం ఆత్మగౌరవం కోసం అధికార పార్టీ. ప్రతిపక్ష పార్టీలు ఉద్యమ నాయకులు ఆలోచించాలని గొంతు ఎత్తిన మొట్టమొదటి  సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంటే జార్ఖండ్ ఛత్తీస్ గడ్ లాంటి రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన ఉద్యమ కారులను ఏ విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి గౌరవిస్తూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల కోసం అప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేయాలని ఉద్యమం చేసిన సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. విడిపోయిన తెలంగాణ ఉద్యమకారులని వివిధ రాజకీయ పార్టీల లో  ఉన్న తెలంగాణ ఉద్యమకారులని ఐక్యం చేస్తూ చైతన్యం చేస్తూ 33 జిల్లాలు తిరుగుతూ అనేక సదస్సులు నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమకారుల కోసం ఈ రాజకీయ పార్టీల ఆలోచించాలని ఉద్యమం చేసిన సంఘం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం .తెలంగాణ ఉద్యమకారుల సంతకాల సేకరణ. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖలు .రౌండ్ టేబుల్ సమావేశాలు .హైదరాబాదులో 33 జిల్లాల్లో ఉద్యమకారులకు సన్మానాలు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా లు.గన్ పార్కు వద్ద ధర్నా లు.పాద యాత్రలు . పోస్ట్ కార్డు ఉద్యమం .తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం గొంతు ఎత్తండి అని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు లేఖలు .స్వయంగా కలిసి  అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ పెద్దలకి విజ్ఞప్తులు. 23 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిక చేయడం జరిగింది కానీ ఆనాడు కెసిఆర్ గారు విస్మరించడం జరిగింది ఉద్యమకారులని. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారుల  అంశాన్ని అజెండాగా చేసి అన్ని రాజకీయ పార్టీలని కలిసి అసెంబ్లీ ఎన్నికలలో మీ మీ పార్టీల మేనిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమ కోసం మేనిఫెస్టోలో చేర్చాలని కోరడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమ కారుల సంక్షేమం పై హామీలు చేర్చాలని కోరడం జరిగింది. ఆనాడు పిసిసి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారిని కలిసి చర్చించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 250 గజాల ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యము చేర్పించడం జరిగింది. ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలంగాణ ఉద్యమకారులు ముఖ్య భూమిక పోషించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది విస్మరించినటువంటి పార్టీలకి తగిన గుణపాఠం నేర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అనేక సదస్సులు బస్సుయాత్రలు ర్యాలీలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. హరి హర కళా భవన్  హైదరాబాదులో వేలాది మందితో సదస్సు పెట్టి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో ఆ రోజే పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలు కోసం కమిటీ ఏర్పాటు  చేసుకుందామని హామీ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఈ కమిటీ ఏర్పాటు కోసం పొన్నం ప్రభాకర్ గారు సీరియస్ గా ప్రభుత్వంతో మాట్లాడి ఈ కమిటీ ఏర్పాటులో ముఖ్య భూమికని పోషించడం జరిగింది. గత నెలలో తార్నాక లో వేలాది మంది ఉద్యమ కారుల తో సదస్సు నిర్వహించి వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయటం జరిగింది.ఆ సదస్సులో కూడా పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ద్వారా సంఘీభావం ప్రకటించి మాట్లాడటం జరిగింది కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించటం జరిగింది గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమ కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేస్తున్న ఉద్యమ ఫలితము ఈ కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ ద్వారా నిజమైన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించాలని సంక్షేమ ఫలాల్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం లక్ష్యం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమం. సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ. తెలంగాణ పునర్నిర్మానం .తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం.

 గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని నేడు వేలాదిమంది ఉద్యమకారుల సభ్యత్వంతో 33 జిల్లాలలో మండల కమిటీలతో ఒక బలమైన ప్రజాసంఘంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిటారుగా నిలబడి తెలంగాణ ఉద్యమకారుల గొంతుకగా తెలంగాణ సమాజం కు దిక్సూచిగా పనిచేస్తుంది .

 ---------------------------------------------------------------డా చీమ శ్రీనివాస్.. ఫౌండర్ ఛైర్మన్ తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్.