Latest News

అవినీతికి అడ్డాగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం

25 Feb, 2026 33 Views
Main Image
అవినీతికి అడ్డాగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం 
ఏసీబీ విచారణ జరపాలని కోరుతూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం లో ఫిర్యాదు 
సామాజిక కార్యకర్త గాధగోని చక్రధర్ గౌడ్
సిద్దిపేట అర్బన్,ఫిబ్రవరి 25(అవని విలేకరి) అవినీతికి అడ్డాగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ఉందనిసామాజిక కార్యకర్త గాధగోని చక్రధర్ గౌడ్ అన్నారు.తెలంగాణ జాతీయ వజ్రోత్సవల సందర్భంగా నిధుల గోల్ మాల్ విషయమై మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు పై చర్యలు తీసుకోవాలని అవినీతి పైన ఏసీబీ విచారణ జరపాలని కోరుతూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీ లో అవినీతి రాజ్యం ఏలుతుంది అని మండిపడ్డారు.తెలంగాణ జాతీయ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా 7.5 లక్షల రూపాయల గోల్ మాల్ పై ఏసీబీ విచారణ జరిగి మూడు నెలలు గడుస్తున్నా నేటికి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు,మున్సిపల్ బాక్స్ టెండర్ ల పేరిట మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దారి మళ్లించి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు మున్సిపల్ అవినీతి పైన మౌనం వహించడం శోచనీయం అని అన్నారు.మున్సిపల్ అవినీతి లో భాగస్వామ్యులైన అధికారులు రాజకీయ నాయకుల పైన రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.