Latest News

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జర్నలిస్టుల కృషి.

01 Mar, 2026 30 Views
Main Image
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జర్నలిస్టుల కృషి.
- తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే.
సిద్ధిపేట, మార్చి 1(అవని విలేఖరి)
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జర్నలిస్టులు రాత్రింబవళ్ళు రాత్రి  కృషి చేస్తున్నారని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను చిన్న చూపు చూస్తోందని అన్నారు. సిద్దిపేటలోని క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 5 టోర్నీని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మైదానంలో కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర సాధకుడు కెసిఆర్ జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది సిద్ధిపేటలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ టోర్నీలో జర్నలిస్ట్ లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డ్ ఇవ్వకపోగా ఇచ్చిన వాటిని తొలగించాలని చూస్తోందన్నారు. ఉద్యోగులతో పాటు జర్నలిస్టులను హెల్త్ స్కీమ్ లో భాగస్వామ్యం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. జర్నలిస్టుల కోసం కేసీఆర్ ఇంటి స్థలాలు ఇచ్చారని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. జర్నలిస్టుల కోసం పెట్టిన రూ.16కోట్లు వెంటనే జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు మొండి చేయి చూపి, చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గెలిచాక యూట్యూబ్ వాళ్ళ గుండెలపై తన్నాడన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో జర్నలిస్ట్ సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం  నాయకులు కలకుంట్ల రంగాచారి , కూతురు రాజిరెడ్డి, జర్నలిస్టులు  సంజీవరెడ్డి, రంగధాంపల్లి శ్రీనివాస్,  ఐతాశ్రీనివాస్, రఘు,శ్రీనివాస్ రెడ్డి, రాజు, సతీశ్, వెంకన్న తో పాటు బిఆర్ ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, రాజనర్స్, పాలసాయిరాం,సంపత్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.