Latest News

ఆంగ్ల ఉపన్యాసపోటీలలో సత్తా చాటిన నర్మెట విద్యార్థులు.

24 Feb, 2026 79 Views
Main Image

ఆంగ్ల ఉపన్యాసపోటీలలో సత్తా చాటిన నర్మెట విద్యార్థులు.


నంగనూరు, ఫిబ్రవరి 24 (అవని విలేఖరి)స్కిల్ ఇన్ విలేజ్  కాకతీయ సాండ్ బాక్స్, దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆంగ్ల ఉపన్యాస పోటీలలో నర్మెట్ట విద్యార్థులు విజయం సాధించారు, ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3400మంది విద్యార్థులు పాల్గొనగా అందులో నుండి జిల్లా స్థాయికి నర్మెట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 10 మంది ఎంపిక అయ్యారు అందులో నుండి రాష్ట్రస్థాయికి ఇద్దరు విద్యార్థులు పోటీ పడి రెండవ మరియు మూడవ బహుమతులు కైవసం చేసుకోన్నారు. జిల్లా స్థాయి లో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్  విభాగంలో 5 మంది సీనియర్స్ నుండి 5 మంది గెలుపొందడం జరిగింది, సీనియర్స్ విభాగం లో ఎనిమిదవ తరగతి కి చెందిన శివకుమార్ మరియు ఆరవ తరగతికి చెందిన  శరణ్య గెలుపొందరు.రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి వచ్చిన విద్యార్థులను నంగునూరు  మండల ఎంఈవో తగిరెడ్డి దేశి రెడ్డి  మరియు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు, ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని విద్యార్థులను మరియు ఎస్ వి ఐ టీచర్ మాంకాల సంధ్య ను అభినందిస్తూ, విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.