Latest News

సిద్దిపేటలో విద్యార్థిని ఆత్మహత్య. ప్రేమ వ్యవహారమే కారణం.

22 Feb, 2026 91 Views
Main Image

సిద్దిపేటలో విద్యార్థిని ఆత్మహత్య.


ఫిజియోథెరపీ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రీజ


ప్రేమ వ్యవహారమే కారణం.


సిద్దిపేట అర్బన్,ఫిబ్రవరి 22 (ఆవని విలేకరి)ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీజ (20) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం సురభి మెడికల్ కళాశాల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా శ్రీరామ్ పూర్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన శ్రీజకు తల్లి తండ్రి లేకపోవడంతో మేనమామలే ముందుండి కళాశాలలో చేర్పించారు. రోజువారిగానే విద్యార్థులతో కలిసి ఉదయం లేచి తోటి విద్యార్థులతో కలిసి టిఫిన్ కు వెళ్లాల్సిన శ్రీజ  వస్తాను మీరు వెళ్ళండి అంటూ తన స్నేహితులకు చెప్పినట్లు సమాచారం. తోటి స్నేహితులు టిఫిన్ చేసి వెళ్లి చూసేసరికి రూమ్ లో శ్రీజ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం కళాశాల యాజమాన్యానికి తెలుపగా వారు బంధువులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో శ్రీధర్ అనే యువకుడితో పరిచయం పెంచుకోవడంతో సంబంధిత యువకుడు పెళ్లి చేసుకోవాలంటూ విద్యార్థినిపై ఒత్తిడి తెస్తూ శ్రీజ వాళ్ల మేనమామకు కూడా ఫోన్ చేసి మీ కోడలును పెళ్లి చేసుకుంటా మరెవరితో మాట్లాడుతోంది నేనే చేసుకుంటా అని చెప్పినట్లు సమాచారం. మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.