Latest News
మిరుదొడ్డి మండలంలో వడగళ్ల వాన
23 Feb, 2026
226 Views
మిరుదొడ్డి మండలంలో వడగళ్ల వాన
మిరుదొడ్డి/దుబ్బాక,ఫిబ్రవరి 23(అవనివిలేకరి)సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం, కొండాపూర్ గ్రామంలో తీవ్రమైన ఈదురు గాలులతో,కురిసిన వడగళ్ళ వానతో ప్రజలంతా అతలాకుతలమై తీవ్ర దిగ్బ్రాంతికి గురైన్నారు. పెంకుటిల్లలకు తీవ్రమైన నష్టం జరిగినట్లు, వాన నుండి రక్షణకై పెంకుటిండ్లలో వేసుకున్న రేకులు సుడిగాలికి లేచిపోయినట్లు భాదితులు వాపోయారు. మొక్కజొన్న పంటలకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లినట్లు భాధిత రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. రోడ్లవెంబడి కొన్ని పెద్ద చెట్లు కూడా నెలకూలీనట్లు తెలిపారు. అకాలంగా కురిసిన ఈదురు గాలులతో కూడిన వడగoడ్ల వాన భాదితులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.