మహిళలు అన్ని రంగాలలో రాణించాలి.
-మాజీ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి
సికింద్రాబాద్, ఫిబ్రవరి24(అవనివిలేకరి)మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఉప్పల్ మాజీ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.ఉప్పల్ KKR గార్డెన్స్ లో *లావణ్య ఫౌండేషన్* ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారు. డ్రాలో నిలిచిన స్వప్న గారు, సరళ గారు, మహాలక్ష్మి కి కుట్టు మిషన్లను రజిత పరమేశ్వర్ రెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాలు కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తుందన్నారు. చిరు వ్యాపారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు వడ్డీలేని రుణాలను అందిస్తూ చేయూతనిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గారు మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా గుర్తు చేశారు. కార్యక్రమంలో లావణ్య ఫౌండేషన్ ఫౌండర్ లావణ్య , సంధ్య , టీచర్స్ వాణి , మాధురి , నవనీత , లింగంపల్లి రామకృష్ణ, భూసం రంగనాథ్ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల దేవి రెడ్డి, గోరిగే మహేష్, సురేష్, బాలరాజ్, అలుగుల అనిల్, అల్వాల్ భాస్కర్, ప్రేమ్,పూజారి హనుమంతు, మా శెట్టి రాఘవేంద్ర, తుమ్మల రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, మోహన్ నాయక్, ప్రశాంత్ రెడ్డి, బచ్చా రాము, రంగుల శేఖర్, శశికాంత్ రెడ్డి, వంశీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.