Latest News

నలుగురు మావోయిస్టు కీలక అగ్రనేతలు లొంగుబాటు.

24 Feb, 2026 46 Views
Main Image

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ

– చారిత్రాత్మక ముగింపు

ఐసీసీసీ వేదికగా నలుగురు అగ్రనేతల లొంగుబాటు

40 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమానికి చారిత్రాత్మక ముగింపు

ఎస్‌ఐబీ ఆపరేషన్లతో 21 వేల మందిపై చర్యలు

కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతల స్వచ్ఛంద సమర్పణ

నేపాల్‌లో ఉన్న గణపతి అచూకీపై పోలీసులు నజర్

తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రం? 

హైదరాబాద్,ఫిబ్రవరి24(అవనివిలేకరి)తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.మంగలవారం  రాష్ట్ర డీజీపీ శివధర్  ముందు లొంగిపోయారు. ఐసీసీసీ వేదికగా ఈ ప్రకటన చేయను సమాచారం. దాదాపు 40 ఏళ్లుగా సాగిన మావోయిస్ట్ ఉద్యమ చరిత్రకు ముగింపు పలికే విధంగా నలుగురు కీలక అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో –

దేవుజి అలియాస్ తిప్పిరి తిరుపతి (ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ)

మల్లా రాజిరెడ్డి (కేంద్ర కమిటీ సభ్యుడు)

బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (స్టేట్ సెక్రటరీ)

నున్నె నరసింహారెడ్డి (కేంద్ర కమిటీ సభ్యుడు)

శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన మావోయిస్ట్ ఉద్యమం, నాలుగు దశాబ్దాల అనంతరం అధికారికంగా ముగింపు దశకు చేరినట్లైంది.మావోయిస్టులపై చర్యల్లో తెలంగాణ ఎస్‌ఐబీ రికార్డు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మావోయిస్టులపై పలు ఆపరేషన్లు నిర్వహించింది. సోర్స్ బిల్డింగ్, సమగ్ర ఇంటెలిజెన్స్ సేకరణలో ఎస్‌ఐబీ కీలక పాత్ర పోషించింది.ఎస్‌ఐబీ గణాంకాలు ఇలా ఉన్నాయి: 14,078 మంది క్యాడర్ల అరెస్టు

5,865 మంది లొంగుబాటు

1,289 మంది ఎన్‌కౌంటర్లలో మృతి

1,057 ఎన్‌కౌంటర్ ఘటనలు నమోదు

కేంద్ర కమిటీకి చెందిన 23 మంది సభ్యులపై కీలక సమాచారం సేకరించిన ఎస్‌ఐబీ –

7 మంది అరెస్టు

7 మంది లొంగుబాటు

9 మంది ఎన్‌కౌంటర్‌లో మృతి

మొత్తంగా 21,232 మంది మావోయిస్టులపై చర్యల్లో ఎస్‌ఐబీ కీలక పాత్ర పోషించింది.

మావోయిస్ట్ అగ్రనేత గణపతి అచూకీ

మావోయిస్ట్ పార్టీకి దశాబ్దాల పాటు నాయకత్వం వహించిన అగ్రనేత గణపతి అచూకీ లభ్యమైనట్లు సమాచారం. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో పార్టీ సెక్రటరీ పదవిని వదిలిన గణపతి గత కొన్నేళ్లుగా నేపాల్‌లో తలదాచుకున్నట్లు తెలిసింది. తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.

గణపతిని భారత్‌కు రప్పించే దిశగా తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చరిత్రాత్మక లొంగుబాటు

కేంద్ర సెక్రటరీ దేవుజి, స్టేట్ సెక్రటరీ బడే చొక్కారావు, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, నున్నె నరసింహారెడ్డి లొంగుబాటు తెలంగాణ రాజకీయ-భద్రతా చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు.మావోయిస్ట్ ఉద్యమానికి ముగింపు పలుకుతూ తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా అవతరించబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.