Latest News
తెలంగాణ సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన కవి నందిని సిధారెడ్డి.
13 Feb, 2026
16 Views
తెలంగాణ సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన కవి నందిని సిధారెడ్డి.
- తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి. బాలకృష్ణారెడ్డి
తెలంగాణ భావోద్వేగంసిద్ధారెడ్డి కవిత్వం
-దేశపతి శ్రీనివాస్
కుషాయిగూడ, ఫిబ్రవరి 13(అవనివిలేకరి)మహా తెలంగాణ సాహిత్యానికి విశిష్ట సేవలు అందించిన కవి నందిని సిధారెడ్డి అని ఆచార్య వి. బాలకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్ తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘట్ కేసర్ సర్కిల్ పరిధి అంకుషాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్ లో నిర్వహిస్తున్న నందిని సిధారెడ్డి సాహిత్య సమాలోచన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి. బాలకృష్టారెడ్డి ప్రపంచం ఈరోజు ఇండియా వైపు చూస్తుంది 2047 నాటికి స్వతంత్ర భారతదేశ శతాబ్ది ఉత్సవాల్లో వికసిద్భారత్ కావాలి కాబట్టి విద్యార్థులు చదువుకోవడంలో తోటి విద్యార్థులతో పోటీ కాక ప్రపంచం విద్యార్థులతో పోటీ పడాలని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల ఆశల్ని నిలబెట్టాలని అకాడమిక్ సోషల్ రెస్పాన్స్ తో పనిచేయాలన్నారు. విశిష్ట అతిథి తెలంగాణ శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి తొవ్వ నిర్మించిన కవి సిధారెడ్డి అని అన్నారు. తెలంగాణ జీవితపు లోతులు, తెలంగాణ భాషా సంస్కృతి ప్రజల భావోద్వేగాలను తెలియాలంటే, తెలంగాణ జీవితం అర్థం కావాలంటే సిద్ధారెడ్డి కవిత్వం చదవాలన్నారు. సిధారెడ్డి మాట్లాడుతూ నా కవిత్వం నా ఆత్మనున్యత భావాన్ని పోగొట్టుకోవడానికి రాయడం మొదలుపెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నా వంతుగా కృషి చేయడానికి కవిత్వం రాశానని, కవిత్వం రాస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి స్నేహలత, తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బడే సాబ్, తెలుగు భాషా చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎడ్ల కల్లేష్ కార్యదర్శి యల్. జగన్, గౌరవ అతిథులుగా నాలేశ్వరం శంకర్, గంటా మనోహర్ రెడ్డి, కందుకూరు శ్రీరాములు, బాణాల భుజంగ రెడ్డి, ప్రొఫెసర్ శ్రీదేవి, డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ పాల్గొన్నారు.