Latest News

తెలంగాణ సాంస్కృతిక సేనాని జలజక్క అనారోగ్యంతో మృతి

22 Feb, 2026 49 Views
Main Image

తెలంగాణ సాంస్కృతిక సేనాని జలజక్క


దామరపల్లి నర్సింహారెడ్డి  రచయిత 


విప్లవోద్యమంలో ఎన్నో సంవత్సరాలు నిబద్ధతతో పనిచేసిన  జలజక్క క్యాన్సర్‌తో పోరాడుతూ  ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి విప్లవ శక్తులకు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తున్నారు. విద్యార్థి దశలోనే పీడీఎస్‌యూ విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రజా జీవితంలో అడుగుపెట్టిన జలజక్క, అనంతరం సీపీఐ (ఎంఎల్)  జనశక్తి పార్టీ, రైతు–రైతు కూలి సంఘం, సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ, తన గళంతో ప్రజలను ఉత్తేజపరిచిన విప్లవ గాయని గా గుర్తింపు పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటుచేసిన బహిరంగ సభలకు జలజక్క కాలుకు గజ్జ కట్టి భుజాన గొంగడి వేసి తెలంగాణ పాటలతో తెలంగాణ వైపు మళ్ళించారు అరుణోదయ సంస్కృతిక సమస్యలు చురుకైన కళాకారునిగా పనిచేశారు బీడీ కార్మికుల కోసం విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమంలో ప్రపంచీకరణ సామ్రాజ్యవాదం వ్యతిరేక ఉద్యమాలలో అలుపెరుగని పోరాటం నిర్వర్తించింది తాను తుది శ్వాస విచ్చేంత వరకు నమ్మిన సిద్ధాంతం కోసం మార్కిజం లేని నిజం మావో ఆలోచన విధానం పై ఆమె పాటుపడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె పల్లె తిరిగి ప్రజలను చైతన్య పరిచి ప్రజా ఉద్యమాల వైపు మళ్ళించగలిగింది అరుణోదయ విమలక్క తో పైలం సంతోష్ మల్సూర్ వెంకన్న తదితరుల కళాకారులతో ఆమె కళా రంగం కొనసాగింది ఆమె ఎప్పుడు విడుద ప్రజల హృదయాల్లో మెదులుతూనే ఉంటుంది విద్యార్థి దశ నుండి విప్లవోద్యమంలోకి అడుగు పెట్టింది ఆమె అంకెలంచలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది పైలం సంతోష్ కూడా క్యాన్సర్ బారినపడి చనిపోయినాడు ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తెలంగాణ కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉమ్మడి మెదక్ జిల్లాలో కరువు ఏర్పడినప్పుడు కరువు పై ప్రజల్ని సంఘటితం చేసింది  నిత్య నిర్బంధాలను అరెస్టులను ఎదుర్కొంది ఆమె ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా విప్లవోద్యమాన్ని మాత్రం ఏనాడు మర్చిపోలేదు ఏనాడు విడువలేదు జలజక్క లేదన్న వార్తను అందరిని ఉద్యమకారులను కళాకారులను పరిచింది జలజక్కభర్త భూపతి రామచంద్రం ను పార్టీలోనే వివాహం చేసుకుంది మనస్పర్ధలతో విడిపోయారు అయినా ఉద్యమాలలోనే పనిచేస్తూనే ఉందిఅనేక ప్రాంతాల్లో ఆమె పాడిన పోరాట గీతాలు ప్రజల్లో చైతన్యం రగిలించాయి. మల్లుపల్లి అమరవీరులైన కామ్రేడ్ జాన్సన్, కనకయ్య, అప్సర్ బాయిలను స్మరిస్తూ పాడిన గీతాలు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేశాయి. “దీపాల యాలకు వెలుగులే వచ్చేటి బిడ్డలు…” వంటి పాటలు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాయి. మానేరు, మంజీరా, దుబ్బాక, గిరాయిపల్లి మిరుదొడ్డి సిద్దిపేట, సిరిసిల్ల, గుమ్మడిదల, నర్సాపూర్, గజ్వేల్, మెదక్, చేగుంట, నార్సింగు, రామాయంపేట్ తదితర ప్రాంతాల్లో ఆమె పోరాట గీతాలు మార్మోగాయి. జలజక్క పేరు ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని గుర్తు చేసే చిహ్నంగా నిలిచింది. గత రెండు సంవత్సరాలుగా  క్యాన్సర్‌తో దీర్ఘకాలంగా పోరాడిన జలజక్క మరణం ఉద్యమవర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది సిపిఐ ఎంఎల్. జనశక్తి పార్టీకి ఆమె మరణం తీరని లోటుగా పేర్కొంటున్నారు. జలజక్క అంత్యక్రియలు  ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రామాయంపేట సమీపంలోని నార్సింగ్ గ్రామంలో నిర్వహించనున్నారు.