Latest News
తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్
16 Feb, 2026
36 Views
తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్
కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించిన సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ,ఫిబ్రవరి 16(అవనివిలేకరి) బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం నాడు మనోహర్ కుమార్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కావేటి సబిత, అనుచరులు కూడా జాగృతిలో చేరారు.ఈ సందర్భంగా కావేటి మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతిలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవిత గారికి మద్దతునివ్వడం కోసం జాగృతిలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ది కవిత తోనే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన రాజకీయ పంథాను అవలంబిస్తూ యువతకు ప్రాధాన్యత ఇస్తున్న కవిత కి ప్రజల్లో మరింత ఆధరణ లభిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి తాను పని చేస్తానని స్పష్టం చేశారు.