Latest News

ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి.

13 Jun, 2026 75 Views
Main Image
ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి. 
కొండపాక జూన్ 13(అవని విలేకరి) సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు గ్రామస్తుల తెలిపినప్రకారం టీఎస్ 02, ఈ ఎక్స్, 9005, నెంబర్ గల కారు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో దుద్దెడ గ్రామంలో రోడ్డు దాటుతున్న మహిళను తప్పించబోయి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆరే రాధవ్వ, 60, రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన కారు ఆమెను తప్పివ్వడానికి రోడ్డు ఎడమ పక్కకు కారును తింపడంతో అదే వేగంతో ఇంటిముందు కూర్చున్న ఎరుకల లచ్చవ్వ 65, మహిళను ఢీ కొట్టడంతో రాధవ్వ, లచ్చవ్వ అక్కడికక్కడే మృతి చెందడంతో పక్కనే ఉన్న 12 సంవత్సరాల అమ్మాయి ఎగిరి గోడకు పడడంతో ఆమెకు తలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించడంతో మృతి చెందినట్లు తెలిపారు. అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొంటూ పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగిపోవడంతో కారు అక్కడే నిలిచి పోయినట్లుతెలిపారు. కారులో ఉన్న ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలు కాగా వారిని హాస్పిటల్ కు తీసుకు వెళ్లినట్లు తెలిపారు.