కన్నుల పండుగగా శివ పార్వతుల కల్యాణం
ఖాతగుట్ట జాతరలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి
నంగునూరు,ఫిబ్రవరి 15(అవనివిలేకరి)సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖాత గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పురాతన దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఖాత మహాదేవుని దర్శించుకొని వంగ రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.ఈ వేడుకలు కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి శివనామస్మరణ, భజనలు, హారతులతో మార్మోగింది. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై జాతరను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన మహిమలు కలిగిన ఖాత మహాదేవుని కృపతో భక్తులు కోరిన మొక్కులు నెరవేరాలని ఆకాంక్షించారు. గ్రామాలు సుఖశాంతులతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు,మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు యువత తదితరులు పాల్గొన్నారు.