Latest News

ఎన్నికల హామీలను అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్.

17 Feb, 2026 12 Views
Main Image


ఎన్నికల హామీలను అమలు చేయాలని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్.

హైదరాబాద్,ఫిబ్రవరి 17(అవనివిలేకరి)మహిళలు, వృద్ధులు, వికలాంగులు సహా ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని  చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కవిత ఆధ్వర్యంలో మంగళ వారం తెలంగాణ జాగృతి కార్యకర్తలు ప్రజా భవన్ ముట్టడించారు.బేగంపేటలోని ప్రజా భవన్ ఎదుట బైఠాయించి కల్వకుంట్ల కవిత మహిళలు, ఇతర నాయకులు ఆందోళన చేపట్టారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చొరవ తీసుకుని మహిళలకు రూ.2,500, తులం బంగారం ఇవ్వడంతో పాటు పింఛన్లు పెంచాలని నినాదాలు చేశారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్యకు కవిత వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ  మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను  నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 న ప్రవేశ పెట్టే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. లేదంటే సచివాలయం, శాసన సభ ముట్టడిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. మహిళలకు ఇస్తామన్న హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. వాటిని పూర్తి చేయమని అడిగేందుకు ప్రజావాణికి వచ్చాన్నారు. ఇక్కడకు వస్తే సీఎం లేడన్నారు. రోజు ప్రజావాణిలో ఉంటానని చెప్పిన సీఎం ఒక్కసారి మాత్రమే ఉన్నాడని తెలిపారు. జాగృతికి చెందిన విద్యార్థులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. వారిని దుర్భాలాడారన్నారు. ఇలాంటి పనులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాను నేను ప్రజాభవన్ కు వచ్చే కార్యక్రమం లేదని చెప్పారు. తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటే వచ్చానని అన్నారు. తమ దగ్గర ఆధార్ కార్డులు, అప్లికేషన్ ఫారాలు ఉన్నాయని తెలిపారు.ప్రజాభవన్ లో  ఉన్న అధికారులకు శాంతియుతంగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చామన్నారు. ఫిబ్రవరి నెల 26వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయని తెలిపారు. ఈ బడ్జెట్ లో మహిళలకు ఇచ్చిన హామీలు రూ. 2500లు, స్కూటీలు, తులం బంగారం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్  లోనే నిధులు కేటాయించాలని కోరారు. రూ.రెండు వేల పెన్షన్ రూ.నాలుగు వేలు చేయాలనీ, అన్ని హామీలనూ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 వ తేదీ వరకు వేచి చూస్తామన్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేపడతామని తెలిపారు. అవసరమైతే సచివాలయం, అసెంబ్లీ కూడా ముట్టడిస్తామన్నారు. రైతులకు బోనస్ ఇచ్చి ఘనంగా చెప్పుకుంటున్నారని, మీరు ఇస్తామన్నదే ఇచ్చారు తప్ప ఘనకార్యమేమీ చేయలేదని ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చి మహిళలకు ఇవ్వలేదంటే వారి తరఫున మాట్లాడే వాళ్లు లేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను ఎగగొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు. మహిళలకు కోటీశ్వరులను చేస్తామన్నారని, కనీసం వారికి ఇస్తామన్న రూ.2500లయినా ఇవ్వాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.
- బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీఆర్ఎస్ దయతోనే బీజేపీకి ఒకటో, రెండో మున్సిపల్ ఛైర్మన్ సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు ఈ ఎన్నికల్లో సహకారమే తొలిమెట్టు అని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ముందు నుంచి చెప్పినట్లుగానే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని స్పష్టం చేశారు. కరీంనగర్, నారాయణ్ పేట్ లో ఛైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్ హాజరు కాలేదన్నారు. అంతర్గతంగా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించటం కారణంగానే ఒకటో, రెండో సీట్లు వచ్చాయని చెప్పారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని చెప్పారు. దీనికి మున్సిపల్ ఎన్నికల్లో అంతర్గత సహకారమే తొలి మెట్టు అని పేర్కొన్నారు. నారాయణ పేటలో తమకు వైస్ ఛైర్మన్ పదవి రావాల్సి ఉండేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు బెదిరింపులకు దిగి వైస్ ఛైర్మన్ పదవి రాకుండా చేశారని విమర్శించారు.