అన్నదాత కోసం.. హైకోర్టుకు హరీశ్ రావు
సిద్దిపేట రైతుల కోసం న్యాయ పోరాటం
రుణమాఫీ కానీ రైతుల పక్షాన.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్.
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని అవేదన.
సిద్దిపేట నియోజకవర్గంలో 22,849 మందికి రుణమాఫీ కాలేదు
కేవలం 47 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ
- రూ.రెండు లక్షలపై రుణం రుణం ఉన్న రైతుల మాఫీ కాలేదు.
అనేక సార్లు లేఖ రాసిన హరీశ్ రావు
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైకోర్టులో కేసు
రుణమాఫీ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు.
సిద్దిపేట, ఏప్రిల్ 29(అవనివిలేకరి)రుణమాఫీ చేస్తామని.. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ మాట తప్పి, రైతుల నోట్లో మట్టి కొట్టిన రేవంతు సర్కారుపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక రైతులు పడుతున్న కష్టాలు, కన్నీళ్లను చూసి చలించిన హరీశ్ రావు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. అన్యాయానికి గురైన సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో పలు విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
*నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు*
• సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీకి అర్హులైన రైతులు 43,363 మంది ఉన్నారు.
• వీరిలో రుణమాఫీ ప్రయోజనం 20,514 మంది రైతులకు మాత్రమే దక్కింది.
•రుణమాఫీ కోసం 22,849 మంది ఇతులు ఎదురు చూస్తున్నారు.
*రుణమాఫీ పొందిన రైతులు 47 శాతం మాత్రమే
*మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..*
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ పైన ఉన్న అప్పులను రైతులు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించింది. ఈ మాటలు నమ్మి, ఎంతోమంది రైతులు అప్పులు చేసి, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి మరీ ఆ అదనపు మొత్తాన్ని చెల్లించారు. ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఆశపడితే, ఇంతవరకు నిధులు విడుదల చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనివల్ల బ్యాంకుల నుండి రైతులపై ఒత్తిడి, వడ్డీల భారం పెరిగిపోయి, రైతులు మానసిక వేదనకు గురవుతున్నారు.
-హైకోర్టులో హరీష్ రిట్ పిటిషన్..
నియోజకవర్గంలోని వేల మంది రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద గౌరవ హైకోర్టును ఆశ్రయించినట్లు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రైతుల ఖాతాల్లో వెంటనే రుణమాఫీ సొమ్మును జమ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన 22,849 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసేలా ఆదేశించి, బ్యాంకుల నుండి రైతులను కాపాడాలని కోర్టుకు విన్నవించారు. హైకోర్టు ద్వారా తమ రైతులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.