( అవని విలేఖరి) చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి నూతన గ్రామ పంచాయతీకి భవనం మంజూరైనా సందర్బంగా చిన్నకోడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీసం మహేందర్ ఆధ్వర్యంలో చిన్నకోడూరు మండల కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు, గ్రామస్థుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి గ్రామ పంచాయతీ మంజూరుకి సహకరించిన ఉమ్మడి జిల్లా మాజి ఇంచార్జ్ మంత్రి కొండ సురేఖ,ప్రస్తుత ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే మైనం పల్లీ హన్మంత రావ్,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ కు కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో మండల కార్యకర్తలు, నాయకులు, కమ్మర్లపల్లి గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు...