Crime

ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య..

09 Feb, 2026 184 Views
Main Image


ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య..
రూరల్ మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామ శివారులో ఘటన..
కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనేనని స్థానికుల వెల్లడి..
సిద్దిపేట అర్బన్,ఫిబ్రవరి 09(అవని విలేకరి)పెద్దలు తమ పెళ్లి కి ఒప్పుకోవడం లేదని, ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవాపూర్,పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామాల శివారులో చోటుచేసుకుంది.రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణరావుపేట మండలం కేంద్రానికి చెందిన మాదన్న గారి శ్రావణ్ (24) వ్యవసాయం పనులతో పాటు,బైండ్ల పని చేసుకుంటూ ఉండగా,పెద్ద కోడూరు గ్రామానికి చెందిన బోనాల నవ్యశ్రీ (17) డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంది.కాగా ఇద్దరు వరుసకు బావ మరదళ్లు కాగా,గత కొద్ది సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్నట్లు తెలిపారు.అమ్మాయి మైనర్ కావడం,ఆమె కు పెళ్లి కాని అక్క ఉండడంతో,వారి ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో, కలత చెందిన వారు సోమవారం ఉదయం ఇంట్లో నుండి వెళ్లి పోయి, సాయంత్రం పెద్ద లింగారెడ్డి పల్లి గ్రామ శివారులో ఒకే చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.